Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' వర్క్ షాప్ లో పవన్ కల్యాణ్... వీడియో ఇదిగో!
![Pawan Kalyan attends Harihara Veeramallu workshop](https://imgd.ap7am.com/thumbnail/cr-20220930tn63370cafe891c.jpg)
- పవన్ కల్యాణ్, క్రిష్ కాంబోలో 'హరిహర వీరమల్లు'
- హీరోయిన్ గా నిధి అగర్వాల్
- నేడు సరస్వతి పంచమి
- వర్క్ షాప్ ఏర్పాటు చేసిన చిత్రబృందం
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా పీరియాడిక్ చిత్రం 'హరిహర వీరమల్లు' తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.
కాగా, ఇవాళ (సెప్టెంబరు 30) సరస్వతి పంచమి సందర్భంగా 'హరిహర వీరమల్లు' చిత్రబృందం వర్క్ షాప్ నిర్వహించింది. ఈ వర్క్ షాప్ కు పవన్ కల్యాణ్, దర్శకుడు క్రిష్, హీరోయిన్ నిధి అగర్వాల్, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి తదితరులు హాజరయ్యారు. ఇప్పటివరకు పూర్తయిన చిత్రీకరణ, తదుపరి షెడ్యూల్ గురించి చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్, తదితరులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
![](https://img.ap7am.com/froala-uploads/20220930fr63370c7fd0e2a.jpg)