Roja: అమ్మవారి గుడిలో కిరీటాలు ఎత్తుకు పోయింది ఎవరు?: లోకేశ్ కు రోజా ప్రశ్న

Roja questions to Nara Lokesh

  • వైఎస్ హత్యపై వెంకన్న సాక్షిగా ప్రమాణం చేయాలని జగన్ కు లోకేశ్ సవాల్
  • లోకేశ్ కు ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చిన రోజా
  • కొడుకు మీద ప్రమాణం చేసి నిజాలు చెప్పాలంటూ ప్రశ్నలను సంధించిన వైనం

వైఎస్ వివేకా హత్యతో తనకు, తన కుటుంబానికి సంబంధం లేదని గతంలోనే తిరుమల వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రమాణం చేశానని... మీకు, మీ కుటుంబానికి సంబంధం లేదని శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధమా? అని సీఎం జగన్ కు టీడీపీ నేత నారా లోకేశ్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'పప్పు ఇది చెప్పు' అంటూ లోకేశ్ కు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. 

అమ్మవారి గుడిలో కిరీటాలు ఎత్తుకుపోయింది ఎవరు? క్షుద్ర పూజలు చేయించింది ఎవరు? 40 గుడులను కూల్చేసింది ఎవరు? సదావర్తి భూములను పప్పుబెల్లాలకు అమ్మేసిందెవరు? అంతర్వేది రథాన్ని తగలబెట్టిందెవరు? రాముడి విగ్రహాన్ని విరిచేసిందెవరు? నీ కొడుకు మీద ప్రమాణం చేసి నిజాలు చెప్పు? అని రోజా ట్వీట్ చేశారు.

Roja
Jagan
YSRCP
Nara Lokesh
Telugudesam
  • Loading...

More Telugu News