Nara Lokesh: శ్రీవారిపై ప్రమాణం చేస్తారా? లేక బాబాయ్ పై గొడ్డలి పోటు జగనాసుర రక్త చరిత్ర అని ఒప్పుకుంటారా?: నారా లోకేశ్

Nara Lokesh challenges Jagan

  • ఈరోజు తిరుమలకు వెళ్తున్న జగన్
  • వివేకా హత్యతో తనకు సంబంధం లేదని శ్రీవారిపై ప్రమాణం చేశానన్న లోకేశ్
  • శ్రీవారిపై ప్రమాణం చేయడానికి మీరు సిద్ధమా? అని జగన్ కు సవాల్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు తిరుమలకు వెళ్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి ఆయన పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. పెద్ద శేష వాహనం కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రాత్రికి ఆయన తిరుమల కొండపైనే బస చేస్తారు. మరోవైపు, తిరుమలకు వెళ్తున్న జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. 

వైఎస్ వివేకానంద హత్యతో తనకు కానీ, తన కుటుంబానికి కానీ సంబంధం లేదని 14-4-21న కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రమాణం చేశానని లోకేశ్ చెప్పారు. మీ బాబాయ్ హత్యతో మీకు, మీ కుటుంబ సభ్యులకు సంబంధం లేదని శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధమా జగన్ రెడ్డి? అని లోకేశ్ ప్రశ్నించారు. తిరుమలకు వెళ్తున్న మీరు శ్రీవారిపై ప్రమాణం చేస్తారా? లేక బాబాయ్ పై గొడ్డలి పోటు జగనాసుర రక్త చరిత్ర అని ఒప్పుకుంటారా? అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు తోడుగా అబ్బాయ్ కిల్డ్ బాబాయ్ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టారు.

Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP
YS Vivekananda Reddy
Tirumala
  • Loading...

More Telugu News