R Parthiban: పొన్నియిన్ సెల్వన్.. సెట్స్ లో ఐశ్వర్యారాయ్ ఫొటోలు ఇవిగో
![R Parthiban drops unseen pics of Aishwarya Rai Bachchan Sarathkumar from Ponniyin Selvan](https://imgd.ap7am.com/thumbnail/cr-20220926tn6331389b18a5f.jpg)
- షూటింగ్ సందర్భంగా తీసుకున్న ఫొటోలు బయటకు
- ట్విట్టర్ లో షేర్ చేసిన నటుడు పార్తీబన్
- ఐశ్వర్యారాయ్ అంకిత భావానికి ప్రశంసలు
మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న పొన్నియిన్ సెల్వన్ సినిమా పట్ల ఆసక్తి మరింత పెరుగుతోంది. ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. ఈ లోపే సినిమాలోని ప్రధాన నటుల్లో ఒకరైన పార్తీబన్.. ట్విట్టర్ వేదికపై తన అభిమానుల కోసం శాంపిల్ గా కొన్ని ఫొటోలు (పిక్స్) విడుదల చేశారు. ఈ ఫొటోలు సినిమా షూటింగ్ సందర్భంగా తీసుకున్నవి కావడం గమనార్హం.
ఈ ఫొటోల్లో పార్తీబన్ తోపాటు ప్రముఖ నటుడు శరత్ కుమార్, ఐశ్వర్యారాయ్ కూడా ఉన్నారు. ఐశ్వర్యారాయ్ అంకిత భావం, వినయాన్ని పార్తీబన్ ఈ సందర్భంగా ఎంతో మెచ్చుకున్నారు.
![](https://img.ap7am.com/froala-uploads/20220926fr6331385a0c5ef.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20220926fr6331386635a5b.jpg)