Mouse Deer: దారితప్పి గ్రామంలోకి వచ్చిన అరుదైన ‘మౌస్‌డీర్’.. పట్టుకుని ఆడుకున్న చిన్నారులు

Mouse Deer found in Anakapalle district in Andhrapradesh

  • అడవి నుంచి తప్పిపోయి గ్రామంలోకి వచ్చిన మౌస్‌డీర్
  • అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో ఘటన
  • రాష్ట్రంలోని అడువుల్లో ఇలాంటి వన్యమృగం ఉన్నట్టే తమకు తెలియదన్న అధికారులు
  • నేడు విశాఖ జూకు తరలింపు

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం లోసంగిలో అత్యంత అరుదైన వన్యప్రాణి ‘మౌస్‌డీర్’ గ్రామస్థుల చేతికి చిక్కింది. అడవి నుంచి తప్పిపోయి వచ్చిన మౌస్‌డీర్‌ను పట్టుకున్న గ్రామస్థులు దానిని తమ పిల్లలకు ఇవ్వడంతో అది వారికి ఆటవస్తువుగా మారింది. పిల్లలు దానితో ఆటుకుంటుండగా గమనించిన నర్సీపట్నానికి చెందిన జానికిరామ్ అనే వ్యక్తి దానిని వారి నుంచి తీసుకుని  అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రేంజ్ అధికారి అప్పలనర్సు మాట్లాడుతూ.. ఇది అత్యంత అరుదైన వన్యమృగమని, రాష్ట్రంలోని అడవుల్లో ఈ జీవి ఉన్నట్టే తమకు తెలియదని పేర్కొన్నారు. మౌస్‌డీర్‌గా పిలిచే చెవ్రోటైన్ అనేది జింక జాతిలోనే అతి చిన్నది. నేడు దీనిని విశాఖపట్టణం జంతు ప్రదర్శనశాలకు తరలించనున్నట్టు అప్పలనర్సు తెలిపారు.

  • Loading...

More Telugu News