Team India: భారత్-ఆసీస్ టీ20 మ్యాచ్ కాస్తా 8 ఓవర్ల మ్యాచ్ అయింది!

Eight overs match at Nagpur

  • నాగపూర్ లో టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా
  • గత రాత్రి వర్షం... చిత్తడిగా అవుట్ ఫీల్డ్
  • టాస్ బాగా ఆలస్యం
  • ఇప్పటికీ ప్రారంభం కాని మ్యాచ్

నాగపూర్ లో భారత్, ఆసీస్ జట్ల మధ్య జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ ఇంతవరకు ప్రారంభం కాలేదు. నిన్న రాత్రి కురిసిన వర్షంతో అవుట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో మ్యాచ్ బాగా ఆలస్యం అయింది. ఇప్పటికే నిర్ణీత సమయం దాటిపోవడంతో అంపైర్లు ఓవర్లు తగ్గించి మ్యాచ్ జరపాలని నిర్ణయించారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. 

మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు నితిన్ మీనన్, కేఎన్ అనంతపద్మనాభన్ 8 ఓవర్ల మ్యాచ్ జరుపుతున్నట్టు వెల్లడించారు. ఒక్కో జట్టు 8 ఓవర్లు ఆడుతుందని, పవర్ ప్లేలో 2 ఓవర్లు ఉంటాయని, ఒక బౌలర్ రెండు ఓవర్లకు మించి బౌలింగ్ చేయకూడదని తాత్కాలిక నిబంధనలను వివరించారు. 9.15 గంటలకు టాస్ వేసే అవకాశం ఉంది. 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
.

Team India
Australia
Match
2nd T20
Wet Outfield
Nagpur
  • Loading...

More Telugu News