Mohammad Azharuddin: టికెట్ల విక్రయాల్లో అక్రమాలు జరగలేదు: అజారుద్దీన్
- హెచ్ సీఏకు, టికెట్ల విక్రయానికి సంబంధం లేదన్న అజార్
- టికెట్ల విక్రయ బాధ్యతలు పేటీఎంకు అప్పగించామని వెల్లడి
- టికెట్ల విక్రయంపై దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపణ
- బాధితులందరికీ హెచ్ సీఏ తరఫున వైద్య సేవలు అందిస్తున్నామని వివరణ
టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ ఈ నెల 25న జరగనున్న మ్యాచ్ టికెట్ల విక్రయాల వివాదంపై శుక్రవారం పూర్తి వివరాలను వెల్లడించారు. ఈ నెల 25న హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియాల మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ టికెట్ల కోసం జింఖానా మైదానానికి భారీగా జనం తరలిరాగా... తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా... టికెట్లన్నీ అజారుద్దీన్ అమ్మేసుకున్నారంటూ విమర్శలు రేగాయి.