Nandamuri Kalyan Ram: రాజకీయ లాభం కోసం అనేక మంది భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని వాడుకోవడం తప్పు: నందమూరి కల్యాణ్ రామ్

Nandamuri Kalyan Ram response on NTR Name removal
  • హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ అంకురార్పణ చేశారన్న కల్యాణ్ రామ్ 
  • ఆయన చేసిన కృషికి ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనే పేరు పెట్టారని వెల్లడి 
  • యూనివర్శిటీ పేరును మార్చడం బాధను కలిగించిందని వ్యాఖ్య 
విజయవాడలోని హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్సార్ పేరును ఏపీ ప్రభుత్వం పెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాసేపటి క్రితమే ఈ అంశంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. తాజాగా తారక్ అన్నయ్య నందమూరి కల్యాణ్ రామ్ కూడా స్పందించారు. 

ట్విట్టర్ ద్వారా కల్యాణ్ రామ్ స్పందిస్తూ... 1986లో విజయవాడలో మెడికల్ యూనివర్శిటీని స్థాపించారని పేర్కొన్నారు. ఏపీలోని మూడు ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలని కోరుకున్న ఎన్టీఆర్ గారు ఈ మహా విద్యాలయానికి అంకురార్పణ చేశారని తెలిపారు. ఈ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యుత్తమంగా అభివృద్ధి చెంది, లెక్కలేనంత మంది వైద్య నిపుణులను దేశానికి అందించిందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో వైద్య అధ్యయనాల మెరుగుదలకు ఆయన చేసిన కృషిని స్మరించుకునేందుకు ఈ విశ్వవిద్యాలయానికి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని పేరు మార్చారని తెలిపారు. 

ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ 25 ఏళ్లకు పైగా ఉనికిలో ఉన్న ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం పేరును మార్చడం తనకు బాధ కలిగించిందని కల్యాణ్ రామ్ చెప్పారు. కేవలం రాజకీయ లాభం కోసం అనేక మంది భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని వాడుకోవడం తప్పు అని అన్నారు.
Nandamuri Kalyan Ram
NTR
Health University
Tollywood

More Telugu News