Paruchuri Gopalakrishna: కేవీరెడ్డి గారిని ఆ రెండు సినిమాలే దెబ్బతీశాయి: పరుచూరి

Paruchuri said about KV Reddy

  • కేవీ రెడ్డి గురించి ప్రస్తావించిన పరుచూరి 
  • 30 ఏళ్ల  కెరియర్లో 14 సినిమాలు  చేసిన కేవీ రెడ్డి 
  • నష్టాలు తెచ్చిపెట్టిన సొంత సినిమాలు 
  • చివరిదశలో ఆదుకున్న ఎన్టీఆర్
వారి కాంబినేషన్లో వచ్చిన చివరి సినిమా 'శ్రీకృష్ణ సత్య'
తెలుగు సినిమా చరిత్రలో దర్శకుడిగా కేవీ రెడ్డిగారి స్థానం ప్రత్యేకం. పౌరాణిక - చారిత్రక చిత్రాలపై ఆయన వేసిన ముద్ర తిరుగులేనిది .. చెరిగిపోనిది. అలాంటి కేవీ రెడ్డిని గురించి 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు. "కేవీ రెడ్డిగారు 30 ఏళ్ల తన కెరియర్ లో 14 సినిమాలను తెరకెక్కించారు. వాటిలో ఓ రెండు మూడు సినిమాలు ఆయన సొంత నిర్మాణంలోనివి కావడం విశేషం" అని అన్నారు.  

సొంత బ్యానర్లో కేవీ రెడ్డిగారు చేసిన 'భాగ్యచక్రం' .. 'సత్య హరిశ్చంద్ర' వంటి సినిమాలను తన కెరియర్ చివర్లో తీశారు. ఆ సినిమాలు ఆర్ధికంగా ఆయనను చాలా దెబ్బకొట్టాయి. కానీ ఆయన తీసిన 'శ్రీకృష్ణార్జున యుద్ధం' .. ' జగదేకవీరుని కథ' .. 'పాతాళభైరవి' .. 'మాయాబజార్' సినిమాలను ఇప్పటికీ చూస్తూనే ఉన్నాము. ఆయనతో అన్నగారికి ఎంతో అనుబంధం ఉండేది" అని చెప్పారు.  

అప్పట్లో కేవీ రెడ్డిగారికి విజయ - వాహిని వారు దూరమైపోయారు. దాంతో ఆయన ఒంటరివారై పోయారు. కన్న కొడుకుని విదేశాలకి పంపించుకోలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో అన్నగారు ఆయన ఇంటికి వెళ్లి డబ్బు ఇచ్చారు. తనకి ఆ డబ్బు తిరిగి ఇవ్వవలసిన అవసరం లేదనీ ..  ఓ సినిమా చేసి పెట్టమని అడిగారు.  

అలా వచ్చిన 'శ్రీకృష్ణ సత్య' సరిగ్గా ఆడలేదు. ఎస్వీఆర్ డైలాగ్ డెలివరీ డిఫరెంట్ గా ఉండటమే అందుకు కారణమని అంటారు. కేవీరెడ్డి గారు ఎన్నో ఇబ్బందులు .. బాధలు పడ్డారు. అందువలన అనారోగ్యానికి గురికావడం .. 60 ఏళ్లకే చనిపోవడం జరిగింది. కానీ ఏ రోజున ఆయన తన కష్టం ఎవరికీ చెప్పుకోలేదు .. అందుకే ఆయన మహానుభావుడు" అంటూ చెప్పుకొచ్చారు.

Paruchuri Gopalakrishna
paruchuri palukulu
KV Reddy
  • Loading...

More Telugu News