Anchor Lasya: మరోసారి తల్లి కాబోతున్న యాంకర్ లాస్య

Anchor Lasya pregnant again

  • బిగ్ బాస్ సీజన్ 4లో బుల్లితెర ప్రేక్షకులను అలరించిన లాస్య
  • మరోసారి పేరెంట్స్ అవుతున్నామని తెలిపిన బుల్లితెర యాంకర్
  • లాస్య దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్న అభిమానులు

ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ లాస్య మరోసారి తల్లి కాబోతోంది. లాస్య, మంజునాథ్ దంపతులకు ఇప్పటికే జున్ను అనే కుమారుడు ఉన్నాడు. తాజాగా లాస్య సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ... తాము మరోసారి పేరెంట్స్ అవుతున్నామని తెలిపింది. తాను ప్రెగ్నెంట్ అని ఆమె చెప్పింది. తమ కుటుంబం మరో రెండు అడుగులు ముందుకు వేస్తోందని తెలిపింది. మరోవైపు, లాస్య చేసిన ప్రకటనతో ఆమె అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. లాస్య దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

Anchor Lasya
Bigg Boss
Pregnant

More Telugu News