Nagachaitanya: రేపు సెట్స్ పైకి వెళతున్న ద్విభాషా చిత్రం!

Venkatprabhu movie update

  • తెలుగు .. తమిళ భాషల్లో వెంకట్ ప్రభు సినిమా 
  • రేపటి నుంచి మొదలవుతున్న రెగ్యులర్ షూటింగ్ 
  • చైతూ సరసన రెండోసారి నాయికగా కృతి శెట్టి 
  • సంగీత దర్శకుడిగా యువన్ శంకర్ రాజా

ఇప్పుడు కోలీవుడ్ హీరోలంతా తమ సినిమాలు తమిళంతో పాటు అదే రోజున తెలుగులోను విడుదలయ్యేలా చూసుకుంటున్నారు. అలాగే తెలుగు హీరోలు కూడా తమ సినిమాలు తెలుగుతో పాటు తమిళంలోను విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అలా తెలుగు .. తమిళ భాషల్లో చైతూ హీరోగా ఒక సినిమా పట్టాలెక్కుతోంది.

శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. దర్శకుడిగా ఇది ఆయనకి 11వ సినిమా కాగా, హీరోగా చైతూకి 22వ సినిమా. ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకి ముహూర్తం కుదిరింది. రేపటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్టుగా ప్రకటిస్తూ అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. 

ఈ పోస్టర్ ను బట్టి ఈ సినిమాలో చైతూ ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి ఇళయరాజా .. ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా కలిసి పనిచేస్తుండటం విశేషం. 'థ్యాంక్యూ' సినిమా ఫ్లాప్ తో డీలాపడిన చైతూకి ఈ సినిమాతో హిట్ పడుతుందేమో చూడాలి. కృతి శెట్టి 'బంగార్రాజు' తరువాత మరోసారి ఈ సినిమాతో చైతూ జోడీ కడుతుండటం విశేషం.

Nagachaitanya
Krithi Shetty
Venkat Prabhu Movie
  • Loading...

More Telugu News