Abhinayasree: నా విషయంలో చాలా అన్యాయం జరిగిందనే భావిస్తున్నాను: 'బిగ్ బాస్'పై అభినయశ్రీ

Abhinayasree Interview

  • 'బిగ్ బాస్' నుంచి బయటికి వచ్చిన అభినయశ్రీ 
  • హౌస్ లో తన ఆర్గ్యుమెంట్ ను చూపించలేదని ఆరోపణ 
  • తన క్లిప్స్ బయటికి రాలేదంటూ అసహనం 
  • తనకి చాలా బాధగా ఉందంటూ  వ్యాఖ్య 

సీనియర్ ఆర్టిస్ట్ అనురాధ వారసురాలిగా తెలుగు తెరకి అభినయశ్రీ పరిచయమైంది. కొన్ని సినిమాల్లో ముఖ్యమైన పాత్రలను పోషించడమే కాకుండా, ఐటమ్ సాంగ్స్ పరంగా కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ సమయంలో ముమైత్ గట్టిపోటీ ఇవ్వడంతో అభినయశ్రీకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అలాంటి అభినయశ్రీ 'బిగ్ బాస్' సీజన్ సిక్స్ లో పాల్గొనడం .. కొన్ని పరిణామాల నేపథ్యంలో అందులో నుంచి బయటికి వచ్చేయడం కూడా జరిగిపోయింది.

ఈ విషయంపై ఆమె ఒక యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ .. "నా విషయంలో చాలా అన్యాయం జరిగిందనే నేను భావిస్తున్నాను. నాకు సంబంధించిన క్లిప్స్ బయటికి పెద్దగా రాలేదనే విషయం నేను బయటికి వచ్చిన తరువాత నాకు తెలిసింది. నేను దిగాలుగా కూర్చుని ఉండటమే చూపించారుగానీ, నేను మాట్లాడింది .. డాన్సులు చేసింది .. ఆర్గ్యుమెంట్ చేసింది ఏదీ టీవీలో చూపించలేదు. 

నిజంగా నేను చాలా డిజప్పాయింట్ అయ్యాను. ఓటింగ్ విషయంలో నా కంటే క్రింద పొజిషన్ లో ఇద్దరు ఉన్నారు. కానీ వాళ్లు సేవ్ కావడం .. నేను ఎలిమినేట్ కావడం ఆశ్చర్యం. నాలోని టాలెంట్ ను చూపించుకోవడానికే నేను బిగ్ బాస్ కి వెళ్లాను. కానీ డే వన్ నుంచి అలా చూపించడం జరగలేదని, నేను బయటికి వచ్చిన తరువాత మా మదర్ .. నా ఫ్రెండ్స్ చెప్పారు. అలా ఎందుకు చేయవలసి వచ్చిందనేదే నా బాధ" అంటూ ఆవేదనను వ్యక్తం చేసింది.

Abhinayasree
Big Boss
  • Loading...

More Telugu News