Mahesh Babu: మోడల్ అవతారం ఎత్తిన మహేశ్ బాబు... ఫొటోలు ఇవిగో!

Mahesh Babu modelling for mens wear brand Otto

  • పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్న మహేశ్ బాబు
  • ఒట్టో మెన్స్ వేర్ కోసం ఫొటో షూట్
  • ఒట్టో బ్రాండ్ దుస్తుల్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్న మహేశ్
  • సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్న ఫొటోలు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలే కాకుండా అనేక బ్రాండ్లకు ప్రచారకర్తగానూ ఉన్నారు. తాజాగా, ప్రముఖ మెన్స్ వేర్ బ్రాండ్ ఒట్టో కోసం మోడల్ అవతారం ఎత్తారు. ఒట్టో దుస్తులు, యాక్సెసరీస్ ధరించి మోడలింగ్ సెషన్ లో పాల్గొన్నాడు.

ఇటీవల బాగా స్లిమ్ గా తయారైన మహేశ్ ఒట్టో ట్రెండీ కాజువల్స్ లో సూపర్ ఫిట్ గా కనిపిస్తున్నాడు. టీషర్టు, బ్లూ జీన్స్, కళ్లకు కూలింగ్ గ్లాసెస్, రిస్ట్ బ్యాండ్లతో నవతరం ప్రతినిధిగా దర్శనమిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. 

మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కొత్త ప్రాజెక్టు చేస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది.
.

Mahesh Babu
Model
Otto
Mens Wear
Tollywood
  • Loading...

More Telugu News