Raghu Rama Krishna Raju: విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు: రఘురామకృష్ణరాజు

AP CID gave me notices says Raghu Rama Krishna Raju
  • తనతో పాటు రెండు వార్తా ఛానళ్లకు నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఉన్నాయన్నా రఘురాజు 
  • సీఐడీ తనకు మాత్రమే నోటీసులు ఇచ్చిందని వెల్లడి 
  • ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని వ్యాఖ్య 
విచారణకు హాజరు కావాలని ఏపీ సీఐడీ అధికారులు తనకు నోటీసులు ఇచ్చారని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. సీఐడీ నోటీసులకు తాను ఈ నెల 16న సమాధానం ఇచ్చానని చెప్పారు. తనతో పాటు హైదరాబాద్ లో ఉన్న రెండు ప్రముఖ వార్తా ఛానళ్లకు కూడా నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ... తనకు మాత్రమే నోటీసులు ఇచ్చారని తెలిపారు. 

ఇదే విషయాన్ని సీఐడీకి ఇచ్చిన సమాధానంలో తాను చెప్పానని అన్నారు. ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తెలిపానని చెప్పారు.
Raghu Rama Krishna Raju
AP CID
Notices

More Telugu News