Prabhas: పదేళ్ల తర్వాత సొంతూరుకు వెళ్తున్న ప్రభాస్

Prabhas going to his native place after one decade
  • ఈ నెల 11న మృతి చెందిన కృష్ణంరాజు
  • 28న మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ
  • ఈ కార్యక్రమానికి హాజరవుతున్న ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దాదాపు పదేళ్ల తర్వాత తన సొంతూరు మొగల్తూరుకు వెళ్తున్నారు. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఈ నెల 11న అనారోగ్య కారణాలతో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నెల 28న మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్ హాజరవుతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇదిలావుంచితే, కృష్ణంరాజు అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ కు వచ్చినప్పుడు కృష్ణంరాజు ఇంటికి వెళ్లి ప్రభాస్ ను, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Prabhas
Mogalturu
Native Place
Tollywood
Krishnam Raju
Condolence Meet

More Telugu News