Nagarjuna: సినిమా చేద్దామని రాజమౌళిని తరచూ అడుగుతుంటా: నాగార్జున

Akkinenga nagarjuna wishes work with ss rajamouly

  • స్క్రిప్ట్ సిద్ధమయ్యాకే రాజమౌళి హీరో కోసం వెతుకుతారన్న నాగ్
  • అలాంటి సమయం వచ్చినప్పుడే ఇద్దరి కలయిక సాధ్యం అవుతుందని వ్యాఖ్య
  • విడుదలకు సిద్ధంగా ఉన్న నాగ్ సినిమా ‘ది ఘోస్ట్’ 

వరుసగా భారీ విజయాలు అందుకుంటూ..  ప్రతీ చిత్రంతో తన స్టార్డమ్ తో పాటు తెలుగు సినిమా ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్న దర్శకుడు రాజమౌళి. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఆయన అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనతో సినిమా చేయాలని స్టార్ హీరోలంతా భావిస్తున్నారు. ఏదో ఒక వేదిక మీద కొందరు తమ కోరికను వెల్లడిస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కూడా చేరారు. తనకు రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ఉందని ఓ ఇంటర్వ్యూలో తన మనసులో మాట బయట పెట్టారు.  

సమయం వస్తే రాజమౌళితో సినిమా సాధ్యమే అన్నారు. రాజమౌళి దర్శకత్వంలో పూర్తి స్థాయి సినిమా చేయాలని ఉందన్నారు. దీని గురించి దిగ్గజ దర్శకుడిని తాను తరచూ అడుగుతూనే ఉన్నానని తెలిపారు. కానీ, ప్రతిసారి చిరునవ్వే రాజమౌళి సమాధానం అవుతోందన్నారు. తను కథను నమ్మే దర్శకుడని నాగ్ కొనియాడారు. స్ర్కిప్ట్ సిద్ధమయ్యాకే దానికి తగ్గ నటులను వెతుకుతారన్నారు. అలాంటి సమయం వచ్చినప్పుడే తమ కలయిక సాధ్యం అవుతుందని చెప్పారు. ఆ రోజు కోసం ఎదురు చూడాలని అభిప్రాయపడ్డారు. 

  నాగార్జున ఇదివరకు రాజమౌళి తండ్రి దర్శకత్వంలో ‘రాజన్న’ చిత్రంలో నటించారు. ఇందులో యాక్షన్ ఎపిసోడ్ లకు రాజమౌళి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం నాగార్జున హీరోగా నటించిన ‘ది ఘోస్ట్’ చిత్రీకరణ పూర్తయి విడుదలకు రెడీగా ఉంది.

Nagarjuna
Rajamouli
new movie
Tollywood
  • Loading...

More Telugu News