Punjab: యూనివర్శిటీ హాస్టల్లో 60 మంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు లీక్.. ఉద్రిక్తత!

Chandigarh university Girls hostel videos leaked
  • పంజాబ్ లోని చండీగఢ్ యూనివర్శిటీలో దారుణం 
  • హాస్టల్ మేట్స్ ప్రైవేట్ వీడియోలను బాయ్ ఫ్రెండ్ కు పంపించిన విద్యార్థిని
  • ఆన్ లైన్ లో లీక్ చేసిన బాయ్ ఫ్రెండ్
పంజాబ్ లోని చండీగఢ్ యూనివర్శిటీలో దారుణం చోటుచేసుకుంది. ఓ అమ్మాయి తన హాస్టల్ లో ఉన్న 60 మంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలను సీక్రెట్ గా తీసి తన బాయ్ ఫ్రెండ్ కు పంపించింది. అతను ఆ వీడియోలను ఆన్ లైన్ లో లీక్ చేశాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో కలకలం రేగింది. ఈ ఘటనతో హాస్టల్ లోని అమ్మాయిలు షాక్ కు గురయ్యారు. 

పది మంది విద్యార్థినులు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. యూనివర్శిటీలో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. విద్యార్థినుల తల్లిదండ్రులు సైతం ఆందోళనకు దిగారు. క్యాంపస్ కు వచ్చిన పోలీసుల వాహనాన్ని విద్యార్థినులు తగులబెట్టారు. మరోవైపు వీడియోలను తీసి, పంపించిన విద్యార్థినిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Punjab
Chandigarh University
Hostel
Students
Videos
Leak

More Telugu News