Nara Lokesh: వాహ్ సీఎం గారూ... మీ విజ్ఞతకు, వివరణకు, విజన్ కు పెద్ద నమస్కారం: సీఎం జగన్ పై లోకేశ్ సెటైర్లు

Lokesh satires on CM Jagan speech on decentralization
  • నిన్న ఏపీ అసెంబ్లీలో వికేంద్రీకరణపై చర్చ
  • ప్రసంగించిన సీఎం జగన్
  • వికేంద్రీకరణకు అర్థం తెలుసా? అని ప్రశ్నించిన లోకేశ్
అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ ప్రసంగంపై టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ స్పందించారు. వికేంద్రీకరణపై సీఎం వివరణపై సెటైర్ వేశారు. సీఎం గారూ మీకు వికేంద్రీకరణకు అర్థం తెలుసా? అని ప్రశ్నించారు. బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, కందిపప్పు, పామాయిల్ పంచగలగడం వికేంద్రీకరణ అంటారా? వాహ్ సీఎం గారూ... మీ విజ్ఞతకు, వివరణకు, విజన్ కు పెద్ద నమస్కారం అంటూ లోకేశ్ వ్యంగ్యం ప్రదర్శించారు. 

అంతేకాదు, నిన్నటి సభా సమావేశాల్లో సీఎం జగన్ వికేంద్రీకరణ అంశంపై ప్రసంగించిన వీడియో క్లిప్పింగ్ ను కూడా పంచుకున్నారు. గోదావరి వరదల సందర్భంగా తమకు ప్రభుత్వం సాయం అందలేదని ఏ ఒక్కరూ కూడా అనలేదని, ఇది వికేంద్రీకరణ వల్లే సాధ్యమైందని సీఎం జగన్ పేర్కొనడం ఆ వీడియోలో చూడొచ్చు.
Nara Lokesh
Satires
Jagan
Decentralization
AP Assembly Session
TDP
YSRCP

More Telugu News