Doordarshan: నేడు దూరదర్శన్ పుట్టినరోజు.... ఎప్పుడు ప్రారంభించారో తెలుసా...?

Today is Doordarshan foundation day

  • నేడు దూరదర్శన్ వ్యవస్థాపక దినోత్సవం
  • 1959లో ప్రారంభమైన దూరదర్శన్
  • దశాబ్దాల తరబడి ప్రేక్షకులను అలరిస్తున్న చానల్
  • దూరదర్శన్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన అనురాగ్ ఠాకూర్

ఇప్పుడంటే డీటీహెచ్ లు, శాటిలైట్ టెలివిజన్ వ్యవస్థలు, కేబుల్ టీవీ వ్యవస్థలు ఉన్నాయి. 90వ దశకంలోనూ, అంతకుముందు మాత్రం యాంటెన్నాలే టీవీ ప్రసారాలకు ఊతం. అప్పట్లో దూరదర్శన్ చానల్ ఒక్కటే ప్రసారమయ్యేది. 

వారాంతపు రోజుల్లో శనివారం తెలుగు సినిమా, ఆదివారం హిందీ సినిమా, ప్రతి బుధవారం చిత్రలహరి, వ్యవసాయ కార్యక్రమాలు, డాక్యుమెంటరీ ఫిల్ములు, వార్తలు... ఇలాంటి కార్యక్రమాలతో దూరదర్శన్ జాతీయస్థాయిలో అభిమానులను సంపాదించుకుంది. తర్వాత కాలంలో దూరదర్శన్ ప్రాంతీయ చానళ్లు కూడా వచ్చాయి. 

ఇప్పుడవన్నీ ప్రసారాలు కొనసాగిస్తున్నా, గతంతో పోల్చితే వాటి ప్రేక్షకుల సంఖ్య బాగా తగ్గింది. అందుకు కారణం ప్రైవేటు వినోద చానళ్లే. అయినప్పటికీ దూరదర్శన్ మనుగడ సాగిస్తోంది. 

ఇక అసలు విషయానికొస్తే... నేడు దూరదర్శన్ పుట్టినరోజు. 1959 సెప్టెంబరు 15న ఈ చానల్ ను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. దూరదర్శన్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా ఉన్న దూరదర్శన్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. 

దశాబ్దాల తరబడి ప్రజలకు సేవలు అందిస్తున్న దూరదర్శన్ మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. దూరదర్శన్ భాండాగారంలో భద్రపరిచిన అనేక కథనాలు, కార్యక్రమాలు భారతదేశ సుసంపన్న చరిత్రకు తరగని నిధి అని అభివర్ణించారు.

Doordarshan
Foundation Day
Channel
India
  • Loading...

More Telugu News