కొత్త ఏడాది ఆరంభంలోనే రాజమౌళితో సెట్స్ పైకి మహేశ్!
- మహేశ్ 28వ సినిమాకి సన్నాహాలు
- ఈ నెలలోనే మొదలుకానున్న ప్రాజెక్టు
- తరువాత ప్రాజెక్టు రాజమౌళితో
- జనవరి 26వ తేదీన లాంచ్ చేసే ఆలోచన
ఆ తరువాత సినిమాను రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పటి నుంచి మొదలవుతుందా అనే ఆసక్తి కూడా అభిమానుల్లో ఉంది. జనవరి 26వ తేదీన ఈ సినిమా షూటింగును లాంఛనంగా ప్రారంభించాలనే ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. ఆ దిశ గానే పనులు జరుగుతున్నాయని అంటున్నారు.
ఇది దక్షిణాఫ్రికా నేపథ్యంలో నడిచే అడ్వెంచర్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేశ్ లుక్ కూడా డిఫరెంట్ గా ఉండనుందని అంటున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు .. స్క్రిప్ట్ పై కసరత్తు ముగింపు దశకి చేరుకున్నాయని చెబుతున్నారు. ఇది పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుందనే విషయం ప్రత్యేకంగా చెప్పవలసిన పనే లేదు.