YS Sharmila: తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైయస్ షర్మిల

Minister Niranjan Reddy is a dog says YS Sharmila
  • షర్మిల, నిరంజన్ రెడ్డి మధ్య పేలుతున్న మాటల తూటాలు
  • మొరిగినంత మాత్రాన అబద్ధాలు నిజం కావన్న షర్మిల
  • సిగ్గు తెచ్చుకుని వైయస్సార్ లా జీవించాలన్న షర్మిల
వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు, తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డికి మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నిరంజర్ రెడ్డి గురించి షర్మిల మాట్లాడుతూ, ఆయన ఒక వీధి కుక్క అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ గురించి తెలియకుండానే మొరిగితే... అబద్ధాలు నిజం కావని అన్నారు. వైయస్ మరణిస్తే 700 గుండెలు ఆగిపోయాయని చెప్పారు. 

ఇకనైనా నిరంజన్ రెడ్డి సిగ్గు తెచ్చుకుని వైయస్సార్ లా జీవించాలని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకే కాకుండా తెలంగాణ తల్లికి కూడా వెన్నుపోటు పొడిచారని అన్నారు. పథకాల పేరు చెప్పి, మోసపూరిత హామీలను ఇచ్చి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. బంగారు తెలంగాణ అనేది కేవలం కేసీఆర్ కుటుంబానికి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాత్రమేనని చెప్పారు.
YS Sharmila
YSRTP
Niranjan Reddy
TRS

More Telugu News