Andhra Pradesh: మరోసారి ఏపీ ప్రభుత్వం రుణం బాట.. ఈ విడత రూ.1,000 కోట్లు!
![Andhra pradesh Govt again go for debt market for Rs 1000 crores](https://imgd.ap7am.com/thumbnail/cr-20220911tn631d84493ac87.jpg)
- 13వ తేదీన ఆర్ బీఐ సెక్యూరిటీల వేలంలో పాల్గొననున్న సర్కారు
- ఇదే విషయంపై ఆర్ బీఐకి సమాచారం
- రూ.1,000 కోట్ల సమీకరణకు ప్రయత్నం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై రుణ భారం పెరిగిపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లోనే సర్కారు భారీగా రుణాలను సమీకరించింది. మరో విడత రూ.1,000 కోట్ల కోసం ఈ నెల 13న ఆర్ బీఐ నిర్వహించే వేలంలో పాల్గొంటామంటూ అధికారికంగా సమాచారం ఇచ్చింది.
ఏపీ సర్కారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో అంటే ఆగస్ట్ నాటికి రూ.48వేల కోట్లకు పైగా రుణాలు సమీకరించింది. ఆర్ బీఐ వేలంలో పాల్గొని రూ.1,000 కోట్ల రుణం పొందితే, అది రూ.49,100 కోట్లకు చేరుతుంది. ఇక ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్ల రూపంలో తీసుకున్న రుణాలు వీటికి అదనం.