Telangana: తెలంగాణలో తాజాగా 106 కరోనా పాజిటివ్ కేసులు
![Telangana corona report](https://imgd.ap7am.com/thumbnail/cr-20220910tn631ca5f3ea7b0.jpg)
- గత 24 గంటల్లో 9,662 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 55 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 151 మంది
- ఇంకా 888 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 9,662 శాంపిల్స్ పరీక్షించగా, 106 కరోనా పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా హైదరాబాదులో 55 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇంకా 363 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అదే సమయంలో 151 మంది కరోనా నుంచి కోలుకోగా, కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు.
తెలంగాణలో ఇప్పటివరకు 8,35,853 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,30,854 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 888 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు.
![](https://img.ap7am.com/froala-uploads/20220910fr631ca5cfc2123.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20220910fr631ca5dee7e12.jpg)