Incharge: పలు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇన్చార్జిలను ప్రకటించిన బీజేపీ

BJP appoints party in charges to states and UTs

  • తెలంగాణకు తరుణ్ చుగ్  
  • సహ ఇన్చార్జిగా అరవింద్ మీనన్
  • విజయ్ రూపానీకి పంజాబ్, చండీగఢ్ బాధ్యతలు
  • మధ్యప్రదేశ్ ఇన్చార్జిగా మురళీ ధర్ రావు

బీజేపీ అధినాయకత్వం పలు రాష్ట్రాలకు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇన్చార్జిలను నియమించింది. తెలంగాణ బీజేపీ ఇన్చార్జిగా తరుణ్ చుగ్ నియమితులయ్యారు. సహ ఇన్చార్జిగా అరవింద్ మీనన్ కు బాధ్యతలు అప్పగించారు. మరో ఏడాదిన్నరలో లోక్ సభ ఎన్నికలు రానుండడం, ఆయా రాష్ట్రాల్లో పార్టీ బలోపేతాన్ని దృష్టిలో ఉంచుకుని బీజేపీ హైకమాండ్ పార్టీ ఇన్చార్జిల నియామకం చేపట్టింది. అంతేకాదు, కొందరు నేతలకు ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల బాధ్యతలు అప్పగించింది. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీకి పంజాబ్, చండీగఢ్ బాధ్యతలు అప్పగించారు.

తాజాగా ప్రకటించిన ఇన్చార్జిలు, సహ ఇన్చార్జిలు వీరే...
1. తెలంగాణ- తరుణ్ చుగ్, అరవింద్ మీనన్
2. బీహార్- వినోద్ తవాడే, హరీశ్ ద్వివేది
3. చత్తీస్ గఢ్- ఓం మాధుర్, నితిన్ నబీన్
4. డయ్యూడామన్ మరియు దాద్రానగర్ హవేలీ- వినోద్ సోంకర్
5. హర్యానా- బిప్లబ్ కుమార్ దేబ్
6. కేరళ- ప్రకాశ్ జవదేకర్, డాక్టర్ రాధామోహన్ అగర్వాల్
7. లక్షద్వీప్- డాక్టర్ రాధామోహన్ అగర్వాల్
8. మధ్యప్రదేశ్- పి.మురళీధర్ రావు, పంకజా ముండే, డాక్టర్ రామ్ శంకర్ కథేరియా
9. ఝార్ఖండ్- లక్ష్మీకాంత్ బాజ్ పాయి
10. పంజాబ్- విజయ్ భాయ్ రూపానీ, డాక్టర్ నరీందర్ సింగ్ రైనా
11. చండీగఢ్- విజయ్ భాయ్ రూపానీ
12. రాజస్థాన్- అరుణ్ సింగ్, విజయ రహత్కార్
13. త్రిపుర- డాక్టర్ మహేశ్ శర్మ
14. పశ్చిమ బెంగాల్- మంగళ్ పాండే, అమిత్ మాలవ్యా, సుశ్రీ ఆశా లక్రా
15. ఈశాన్య రాష్ట్రాలు- డాక్టర్ సంబిత్ పాత్రా (సమన్వయకర్త), రుతురాజ్ సిన్హా (సంయుక్త సమన్వయకర్త).

Incharge
States
UTs
BJP
India
  • Loading...

More Telugu News