Buckingham Palace: క్వీన్​ ఎలిజబెత్​ కన్నుమూసినప్పుడు బకింగ్​ హమ్​ ప్యాలెస్​ పై ఒకేసారి రెండు ఇంద్ర ధనస్సులు.. వీడియో ఇదిగో

Rainbow at Buckingham Palace

  • లండన్ లోని బకింగ్ హమ్ ప్యాలెస్ వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడిన అభిమానులు
  • ఒకే సమయంలో రెండు ఇంద్ర ధనస్సులు ఏర్పడటంపై అందరిలో ఆసక్తి
  • ఇది మహారాణికి ప్రకృతి అర్పించిన నివాళి అంటూ కామెంట్లు

బ్రిటీష్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ 2 కన్నుమూయడంతో ఆ దేశంతో పాటు దానితో అనుబంధమున్న చాలా దేశాలు విషాదంలో మునిగిపోయాయి. ఆమె ఆరోగ్యం బాగోలేదన్న విషయం తెలియగానే చాలా మంది అభిమానులు లండన్ లోని బకింగ్ హమ్ ప్యాలెస్ వద్దకు చేరుకుని.. దేవుడిని ప్రార్థించడం మొదలుపెట్టారు. కొంతసేపటి తర్వాత ఎలిజబెత్ 2 చనిపోయినట్టుగా రాజ కుటుంబం ప్రకటించింది. అయితే ఈ సమయంలో బకింగ్ హమ్ ప్యాలెస్ వద్ద జరిగిన ఓ ఘటన అందరినీ ఆకర్షించింది.

రెండు రెయిన్ బోలతో..  
  • క్వీన్ ఎలిజబెత్ 2 కన్నుమూసిన సమయంలో బకింగ్ హమ్ ప్యాలెస్ వద్ద వాతావరణ పరిస్థితి చిత్రంగా ఉంది. అప్పటిదాకా వాన పడి కాస్త తెరిపి ఇవ్వగా.. ఓ వైపు ఎండ రాగా, అదే సమయంలో సన్నగా వాన కురుస్తూ ఉంది.
  • అదే సమయంలో ఒకదానిపై ఒకటి రెండు ఇంద్ర ధనస్సులు ఏర్పడ్డాయి. బకింగ్ హమ్ ప్యాలెస్ వద్ద చేరినవారంతా ఇది చూసి ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
  • ‘క్వీన్ ఎలిజబెత్ కు ప్రకృతి కూడా రెండు ఇంద్ర ధనస్సులతో ఘనంగా నివాళి అర్పించింది’ అంటూ చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఇంద్ర ధనస్సు వీడియోలను, ఫొటోలను షేర్ చేస్తున్నారు.

Buckingham Palace
Rainbow
Queen Elizabeth
Elizabeth II
England
UK
Offbeat
International

More Telugu News