BJP: క‌ర్త‌వ్య ప‌థ్‌గా మారిన రాజ్ ప‌థ్‌... నేతాజీ విగ్ర‌హాన్ని ప్రారంభించిన మోదీ

pm modi unviels netaji statue in delhi

  • ఖ‌మ్మం జిల్లా గ్రానైట్‌తో రూపొందిన నేతాజీ విగ్ర‌హం
  • సెంట్ర‌ల్ విస్టా ఎవెన్యూను ప్రారంభించిన మోదీ
  • వేడుక‌గా జ‌రిగిన కార్య‌క్ర‌మం

దేశ రాజ‌ధాని ఢిల్లీలో పార్ల‌మెంటు, రాష్ట్రప‌తి భ‌వ‌న్, ఇండియా గేట్‌ ప‌రిస‌రాల్లో ఇన్నాళ్లూ రాజ్ ప‌థ్‌గా కొన‌సాగిన చారిత్రక ప్రాంతం గురువారం 'క‌ర్త‌వ్య ప‌థ్‌'గా త‌న పేరు మార్చుకుంది. రాజ్ ప‌థ్‌కు మ‌రిన్ని అధునాత‌న సౌక‌ర్యాల‌ను చేరుస్తూ కేంద్ర ప్ర‌భుత్వం మ‌రింత సుంద‌రంగా తీర్చిదిద్దిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా క‌ర్త‌వ్య ప‌థ్‌లోనే 28 అడుగుల ఎత్తున స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విగ్ర‌హాన్ని కూడా కేంద్రం ఏర్పాటు చేసింది.

నేతాజీ విగ్ర‌హాన్ని ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ... ఆ వెంట‌నే క‌ర్త‌వ్య ప‌థ్‌కు లాంఛ‌నంగా ప్రారంభోత్స‌వం చేశారు. ఖ‌మ్మం జిల్లాలో దొరికే గ్రానైట్‌తో నేతాజీ విగ్ర‌హాన్ని ప్ర‌ముఖ శిల్పి అరుణ్ యోగ‌రాజ్ చెక్కారు. ఈ విగ్ర‌హం ద్వారా దేశంలోని అత్యంత ఎత్తైన ఏక‌శిలా విగ్ర‌హాల జాబితాలో నేతాజీ విగ్ర‌హం కూడా చేరింది. నేతాజీ విగ్ర‌హం, క‌ర్త‌వ్య ప‌థ్‌ల‌తో పాటు సెంట్ర‌ల్ విస్టా ఎవెన్యూను కూడా ప్ర‌ధాని మోదీ ప్రారంభించారు.

  • Loading...

More Telugu News