Prashant Kishor: నితీశ్ కుమార్ వ్యాఖ్యలకు ఫొటోలతో రిప్లై ఇచ్చిన ప్రశాంత్ కిశోర్

Prashant Kishor Clapback At Nitish Kumar

  • బీజేపీ కోసం ప్రశాంత్ కిశోర్ పని చేస్తున్నారన్న నితీశ్ కుమార్
  • ప్రధానికి నితీశ్ కుమార్ నమస్కారాలు చేస్తున్న ఫొటోలను షేర్ చేసిన పీకే
  • ఇతరులపై ఆధారపడకుండా నితీశ్ ఉండలేరన్న ప్రశాంత్ కిశోర్

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బీజేపీతో ఉండాలనుకుంటున్నారని బీహార్ సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రహస్యంగా ఆయన బీజేపీ కోసం పని చేస్తున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రశాంత్ కిశోర్ స్పందించారు. ట్విట్టర్ ద్వారా ఆయన నాలుగు ఫొటోలను షేర్ చేశారు. ఈ ఫొటోల్లో ప్రధాని మోదీకి నితీశ్ కుమార్ నమస్కారాలు చేస్తున్నట్టు ఉంది.    

నెల రోజుల క్రితం అధికారం పక్షంతో ఉన్న నితీశ్ కుమార్... ఇప్పుడు విపక్షంతో ఉన్నారని ప్రశాంత్ కిశోర్ ఎద్దేవా చేశారు. ఇతరులపై ఆధారపడకుండా ఆయన ఉండలేరని చెప్పారు. బిహార్ లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం జాతీయ రాజకీయాల్లో పెద్దగా ప్రభావం చూపుతుందని తాను భావించడం లేదని అన్నారు. ఈ మార్పును తాను కేవలం రాష్ట్రం వరకే చూస్తానని చెప్పారు.

More Telugu News