Telangana: తెలంగాణలో మరో కొలువుల నోటిఫికేషన్ విడుదల
![tspsc releases a notification tofill up 175 posts in town planning](https://imgd.ap7am.com/thumbnail/cr-20220907tn6318aa6983d6a.jpg)
- వరుసగా విడుదలవుతున్న నోటిఫికేషన్లు
- టౌన్ ప్లానింగ్‌లో 175 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్
- ఈ నెల 20 నుంచి అక్టోబర్ 13 వరకు దరఖాస్తులకు అవకాశం
తెలంగాణలో నిరుద్యోగులకు వరుసగా శుభవార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 90 వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించిన తర్వాత ఆయా శాఖల్లోని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వరుసగా విడుదలవుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా బుధవారం మరో నోటిఫికేషన్ విడుదలైంది.
తెలంగాణ పురపాలక శాఖలో ఖాళీగా ఉన్న 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్ధులు ఈ నెల 20 నుంచి అక్టోబర్ 13 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని టీఎస్పీఎస్సీ తెలిపింది.