Rashi Khanna: మూడు భాషల్లో మూడు సినిమాలలో రాశి ఖన్నా!

Rashi khanna special

  • వరుస ఫ్లాపులతో ఉన్న రాశి ఖన్నా 
  • కొత్త కథానాయికల నుంచి ఎదురవుతున్న పోటీ 
  • అవకాశాల కోసం గట్టిగానే ప్రయత్నాలు
  • రానున్న సినిమాల పైనే ఆశలు

రాశి ఖన్నా మంచి అందగత్తె అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇక నటన విషయంలోను ఆమెకి వంక బెట్టడం కష్టమే. ఈ మధ్య కాలంలో ఆమె కామెడీతోను ఆకట్టుకుంటోంది. అయితే కొంతకాలంగా ఆమె విషయంలో హిట్టు బెట్టు చేస్తోంది. దాంతో వరుసగా మూడు ఫ్లాపులు ఆమె ఖాతాలో చేరిపోయాయి. 

'థ్యాంక్యూ' సినిమా కూడా పరాజయంపాలు కావడంతో ఆమెకి ఇక అవకాశాలు అంతగా రాకపోవచ్చని అంతా అనుకున్నారు. కానీ తాజాగా ఆమె శర్వానంద్ జోడీగా ఒక సినిమాను అంగీకరించింది. పీపుల్ మీడియా వంటి పెద్ద బ్యానర్ నుంచి ఈ ఛాన్స్ రావడం విశేషంగానే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న తెలుగు సినిమా ఇదొక్కటే. 

ఒక వైపున కొత్త కథానాయికల నుంచి పోటీ .. మరో వైపున వరుస ఫ్లాపులు. దాంతో రాశి ఖన్నాకి అవకాశాల కోసం పరుగులు తప్పడం లేదు. ఇక తమిళంలో 'సర్దార్' .. హిందీలో 'యోధ' సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రావలసి ఉన్నాయి. అక్కడ ఆమె కుదురుకోవాలన్నా ఈ సినిమాలు హిట్ కొట్టాల్సిందే.

Rashi Khanna
Sharwanand
Tollywood
  • Loading...

More Telugu News