Balakrishna: తనయుడు మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుక జరిపిన నందమూరి బాలకృష్ణ
![Balakrishna celebrates his son Mokshagna birthday](https://imgd.ap7am.com/thumbnail/cr-20220906tn631738a4c2fa1.jpg)
- నేడు మోక్షజ్ఞ జన్మదినం
- బాలయ్య నివాసంలో వేడుక
- సోషల్ మీడియాలో అభిమానుల కోలాహలం
టాలీవుడ్ సీనియర్ కథానాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. తనయుడు మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకలను బాలకృష్ణ తన నివాసంలో జరిపారు. కుమారుడికి కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు, ఆశీస్సులు అందజేశారు. అటు, మోక్షజ్ఞకు నందమూరి అభిమానులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి సంబంధించిన ప్రకటన ఏదైనా వస్తుందని ఆశించిన అభిమానులు నిరాశకు గురవుతున్నారు.