Telangana: ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభ 12వ తేదీ వరకు వాయిదా

Telangana Assembly session begins

  • ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన సమావేశాలు
  • మల్లు స్వరాజ్యం, జనార్దన్ రెడ్డిల మృతికి సంతాపం ప్రకటించిన సభ్యులు
  • కాసేపట్లో ప్రారంభం కానున్న బీఏసీ సమావేశం

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11.30 గంటలకు ఉభయసభలు ప్రారంభమయ్యాయి. ఈ నాటి సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సభ ప్రారంభమైన వెంటనే ఇటవలి కాలంలో మరణించిన ఎమ్మెల్యేలకు సంతాపం తెలిపారు. మల్లు స్వరాజ్యం, జనార్దన్ రెడ్డిల మృతికి సంతాపాన్ని ప్రకటించారు. వీరి మృతికి సంతాపాన్ని ప్రకటిస్తూ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. 

అనంతరం తమ తమ శాఖలకు చెందిన నివేదికలను విద్యుత్ మంత్రి జగదీశ్ రెడ్డి, పర్యాటక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మరోవైపు, ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్యానెల్ స్పీకర్లుగా రెడ్యా నాయక్, మోజం ఖాన్, హనుమంత్ షిండేల పేర్లను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. అనంతరం, సభను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేశారు. కాసేపట్లో బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు.

  • Loading...

More Telugu News