Nagachaitanya: తెలుగు తెరకి మాలాశ్రీ కూతురు!

Raathana in Chaithu Movie

  • కన్నడలో దర్శన్ జోడీగా రాధనా రామ్ 
  • పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న సినిమా 
  • చైతూ సరసన ఛాన్స్ కొట్టేసిందంటూ టాక్ 
  • పరశురామ్ దర్శకత్వంలో రూపొందే సినిమా ఇది  

తెలుగులో నిన్నటి తరం హీరోయిన్ గా మాలాశ్రీ ఒక వెలుగు వెలిగింది. 'ప్రేమఖైదీ' .. 'బావ బావమరిది' .. 'ఊర్మిళ' వంటి సినిమాలు ఆమెకి భారీ విజయాలను అందించాయి. ఆ తరువాత ఆమె కన్నడ సినిమాలతో బిజీ అయింది. అందువలన తెలుగు సినిమాలకి దూరమైంది. 

తన కూతురు రాధనా రామ్ ను హీరోయిన్ ను చేసే ఆలోచనలో ఉన్నట్టుగా ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా మాలాశ్రీ చెప్పింది. ఇప్పుడు ఆమె కూతురు రాధనా రామ్ కన్నడలో దర్శన్ సరసన నాయికగా ఒక భారీ సినిమాను చేస్తోంది. దీనిని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. 

ఈ నేపథ్యంలోనే తెలుగు తెరకి కూడా రాధనాను పరిచయం చేస్తున్నట్టుగా తెలుస్తోంది .. అదీ నాగచైతన్య జోడీగా.  చైతూ హీరోగా పరశురామ్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. దాదాపు రాధనా రామ్ ఎంపిక ఖరారైనట్టు చెబుతున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందేమో చూడాలి.

Nagachaitanya
Rathana
Parashuram movie
  • Loading...

More Telugu News