Junior NTR: ఎన్టీఆర్ .. కొరటాల మూవీలో విజయశాంతి?

Vijayashanthi in Koratala Movie

  • కొంతకాలంగా సినిమాలకి దూరంగా విజయశాంతి
  • 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో రీ ఎంట్రీ 
  • ఎన్టీఆర్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ 
  • పవర్ఫుల్ అత్త పాత్ర చేయనుందంటూ టాక్ 

ఎన్టీఆర్ తన తాజా చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. 'ఆర్ ఆర్ ఆర్' సినిమా సంచలన విజయాన్ని సాధించడంతో, ఎన్టీఆర్ పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. 

ఈ సినిమాలో ఎన్టీఆర్ అత్త పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందట. గతంలో శారద ... వాణిశ్రీ పోషించిన పాత్రల తరహాలో ఈ పాత్రను డిజైన్ చేశారని సమాచారం. ఈ పాత్రకి విజయశాంతి అయితేనే సరైన న్యాయం జరుగుతుందని భావించిన కొరటాల, ఆమెను తీసుకోవడం జరిగిందని అంటున్నారు.

విజయశాంతి చాలా కాలంగా సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చారు. ఆమధ్యనే 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో ఆమె రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో తన పాత్ర నచ్చడం వలన, ఆ స్థాయి పారితోషికాన్ని ఇవ్వడానికి నిర్మాతలు అంగీకరించడం వలన చేశారు. ఆ తరువాత ఆమె చేయనున్న సినిమా ఇదే కావడం అందరిలో ఆసక్తిని పెంచే అంశం.

Junior NTR
Koratala Siva
Vijayashanthi
  • Loading...

More Telugu News