BJP: బీజేపీలో చేరిన భార‌త తొలి మ‌హిళా రేస‌ర్ అలీషా.. వీడియో ఇదిగో

Female national racing champion ALISHA ABDULLAH joined bjp

  • త‌మిళ‌నాడుకు చెందిన అలీషా అబ్దుల్లా
  • రేసింగ్‌లో నేష‌న‌ల్ ఛాంపియ‌న్‌గా ఎదిగిన వైనం
  • అన్నామ‌లై స‌మ‌క్షంలో బీజేపీ తీర్ధం పుచ్చుకున్న అలీషా

అలీషా అబ్దుల్లా... భార‌త తొలి మహిళా రేస‌ర్‌గా గుర్తింపు పొందిన క్రీడాకారిణి. రేసింగ్‌లో నేష‌న‌ల్ ఛాంపియ‌న్‌గా నిలిచిన అలీషా తాజాగా రాజకీయ రంగ ప్ర‌వేశం చేశారు. త‌మిళ‌నాడుకు చెందిన అలీషా... శ‌నివారం కేంద్రంలో అధికార పార్టీ బీజేపీలో చేరిపోయారు. బీజేపీ త‌మిళ‌నాడు అధ్య‌క్షుడు అన్నామ‌లై స‌మ‌క్షంలో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలో చేర‌డం అదృష్టంగా భావిస్తున్నాన‌ని ఈ సంద‌ర్భంగా ఆమె పేర్కొన్నారు.

పురుషుల ఆధిప‌త్యంలోని రేసింగ్‌లో ఓ మహిళ‌గా ఎంట్రీ ఇచ్చిన అలీషా.. క‌ట్టుబాట్ల‌ను తెంచుకుని స‌త్తా చాటార‌ని అన్నామలై అన్నారు. రేసింగ్‌లో మెరుగైన ప్ర‌తిభ క‌న‌బ‌ర‌చిన అలీషా బీజేపీలో చేర‌డం త‌మ‌కు ఎంత‌గానో ఆనందంగా ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

More Telugu News