SP Fakkirappa: గణేశ్ నిమజ్జనం ఊరేగింపులో స్టెప్పులేసిన ఎస్పీ ఫక్కీరప్ప... వీడియో ఇదిగో!

SP Fakkirappa dances in Ganesh immersion rally

  • ఏపీలో భక్తిశ్రద్ధలతో వినాయకచవితి ఉత్సవాలు
  • నేడు భారీ ఎత్తున నిమజ్జనాలు
  • అనంతపురం జిల్లా బోడాయిపల్లిలో ఊరేగింపు
  • వేడుకలో పాలుపంచుకున్న పోలీసులు

ఏపీలో గణేశ్ చతుర్థి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఇవాళ వినాయక నిమజ్జనాలు నిర్వహించారు. కాగా, అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ మండలం బోడాయిపల్లిలో నిర్వహించిన గణేశ్ నిమజ్జనం ఊరేగింపులో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి, తాడిపత్రి డీఎస్పీ చైతన్య, తాడిపత్రి రూరల్ సీఐ చిన్న పెద్దయ్య కూడా పాల్గొన్నారు.

ఇక ఊరేగింపులో డప్పుల మోతకు పోలీసులు సైతం కాలు కదిపారు. ఎస్పీ ఫక్కీరప్ప గ్రామ ప్రజలతో కలిసి ఉత్సాహంగా చిందేశారు. ఎస్పీని చూసి ఇతర పోలీసులు కూడా ఊరేగింపులో పాల్గొని స్టెప్పులేశారు. 

ఈ సందర్భంగా, ఫ్యాక్షన్ ఛాయలున్న ఈ గ్రామంలోని రెండు వర్గాలకు చెందినవారిని ఒక్కటిగా చేసి వారితోనూ పోలీసులు చిందులేయించారు. ఎస్పీ అంతటివాడు తమతో కలిసి ఉత్సవాల్లో పాల్గొనడం బోడాయిపల్లి గ్రామస్థులను అమితానందానికి గురిచేసింది.

SP Fakkirappa
SP
Bodaipalli
Ganesh Immersion Rally
Dance
Anantapur District

More Telugu News