YSRCP: బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన మంత్రి పినిపే విశ్వరూప్... మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలింపు
![mild brain stroke to ap minister pinipe vrswarup](https://imgd.ap7am.com/thumbnail/cr-20220902tn63120870614f7.jpg)
- అమలాపురంలో అస్వస్థతకు గురైన విశ్వరూప్
- రాజమహేంద్రవరం ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స
- స్వల్పంగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైనట్లు వైద్యుల నిర్ధారణ
- ప్రస్తుతం విశ్వరూప్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వెల్లడి
ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ శుక్రవారం మధ్యాహ్నం అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అమలాపురంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాలలో పాలుపంచుకున్న అనంతరం విశ్వరూప్ అస్వస్థతకు గురి కాగా... వైద్య చికిత్సల కోసం ఆయనను రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే.
విశ్వరూప్‌కు వైద్యం అందించిన డాక్టర్లు... ఆయన స్వల్పంగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైనట్లుగా తేల్చారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లాలని ఆయనకు వైద్యులు సూచించారు. దీంతో శుక్రవారం రాత్రి రాజమహేంద్రవరం నుంచి విశ్వరూప్‌ను ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం విశ్వరూప్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.