Virat Kohli: కోట్లాది రూపాయలతో ఫామ్ హౌస్ ను కొనుగోలు చేసిన కోహ్లీ, అనుష్క శర్మ

Virat Kohli and Anushka Sharma bought farm house
  • అలీబాగ్ ప్రాంతంలో ఫామ్ హౌస్ కొన్న కోహ్లీ జంట
  • ఫామ్ హౌస్ ధర రూ. 19.24 కోట్లు
  • ఇదే ప్రాంతంలో బంగ్లా కొనుగోలు చేసిన రణవీర్, దీపిక జంట
టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు భారీ ధర వెచ్చించి ఫామ్ హౌస్ ను కొనుగోలు చేశారు. ముంబైకి దక్షిణాన ఉన్న అలీబాగ్ ప్రాంతంలో ఫామ్ హౌస్ ను కొన్నారు. ఈ ఫామ్ హౌస్ విస్తీర్ణం 9 వేల చదరపు మీటర్లు. దీని ధర రూ. 19.24 కోట్లు. ఫామ్ హౌస్ కొనుగోలు కోసం ప్రభుత్వానికి డిపాజిట్ గా వీరు రూ. 1.15 కోట్లు చెల్లించారట. అంతేకాదు స్టాంప్ డ్యూటీ కింద రూ. 3.35 లక్షలను చెల్లించారు. కోహ్లీ ప్రస్తుతం ఆసియా కప్ కోసం యూఏఈలో ఉన్నాడు. దీంతో విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ ఈ లావాదేవీలను పూర్తి చేశాడు. మరోవైపు, రణవీర్ సింగ్, దీపికా పదుకునే జంట కూడా ఇదే ప్రాంతంలో రూ. 22 కోట్లు పెట్టి బంగ్లాను కొనుగోలు చేశారు.
Virat Kohli
Anushka Sharma
Farm House

More Telugu News