Sensex: సెన్సెక్స్ కు స్వల్ప లాభాలు.. నిఫ్టీకి స్వల్ప నష్టాలు

Markets ends in flat mode

  • ఉదయం నుంచి ఊగిసలాట ధోరణి 
  • 37 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 3 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని ఫ్లాట్ గా ముగించాయి. మార్కెట్లు ఉదయం ప్రారంభమైనప్పటి నుంచి ఊగిసలాట ధోరణిని ప్రదర్శించాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు మన మార్కెట్లపై ప్రభావాన్ని చూపాయి. మధ్యాహ్నం తర్వాత మార్కెట్లు లాభాల్లోకి వెళ్లాయి. అయితే, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో చివరకు ఫ్లాట్ గా ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 37 పాయంట్లు లాభపడి 58,803కి పెరిగింది. నిఫ్టీ 3 పాయింట్లు కోల్పోయి 17,539 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.75%), ఐటీసీ (1.72%), ఎల్ అండ్ టీ (1.49%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.95%), యాక్సిస్ బ్యాంక్ (0.92%). 

టాప్ లూజర్స్:
మారుతి (-1.19%), రిలయన్స్ (-1.19%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.04%), నెస్లే ఇండియా (-0.91%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.86%).

  • Loading...

More Telugu News