Sonia Gandhi: సోనియా గాంధీ తల్లి మృతి.. ఇటలీలో ముగిసిన అంత్యక్రియలు
![sonia gandhi mother Paola Maino passes away](https://imgd.ap7am.com/thumbnail/cr-20220831tn630f4b942eb81.jpg)
- ఆగస్టు 27న మరణించిన పాలోవా మయానో
- నిన్న ఇటలీలో ముగిసిన అంత్యక్రియలు
- పార్టీ కీలక నేత జైరాం రమేశ్‌ను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో వార్తలు
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తల్లి పాలోవా మయానో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని సోనియా పరామర్శించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపిన సంగతి తెలిసిందే. వైద్య పరీక్షల కోసం సోనియాగాంధీ విదేశాలకు వెళ్లడం, ఆమెకు తోడుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కూడా వెళ్లడం తెలిసిందే.
తాజాగా సోనియా గాంధీ తల్లి పాలోవా మయానో ఈ నెల 27న (శనివారం) మృతి చెందినట్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ను ఉటంకిస్తూ జాతీయ మీడియా బుధవారం సాయంత్రం వార్తలు ప్రచురించింది. శనివారం మరణించిన పాలోవా మయానో అంత్యక్రియలు మంగళవారం (ఆగస్టు 30)న ముగిసినట్లు కూడా ఆయన తెలిపారు.