Kishan Reddy: శ్రీశైలంలో పర్యటించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి... యాంఫీ థియేటర్ నిర్మాణంపై అసంతృప్తి!

- వినాయచవితి నాడు శ్రీశైల క్షేత్రాన్ని దర్శించిన కిషన్ రెడ్డి
- కుటుంబసమేతంగా భ్రమరాంబ మల్లికార్జునస్వామి దర్శనం
- ఆలయానికి దూరంగా యాంఫీ థియేటర్ నిర్మాణం
- భక్తులు ఎలా వస్తారన్న కిషన్ రెడ్డి
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గణేశ్ చతుర్థి పర్వదినం సందర్భంగా ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం విచ్చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడి భ్రమరాంబ మల్లికార్జునస్వామి వారిని దర్శించుకున్నారు. ఇక్కడ అనేక పూజా క్రతువులు ఆచరించారు. ఆలయ ఆవరణలో గోమాతను భక్తిప్రపత్తులతో సేవించుకున్నారు.
