Amala Paul: నటి అమలాపాల్‌పై లైంగిక వేధింపులు.. స్నేహితుడి అరెస్ట్

Actress Amala Pauls alleged ex boyfriend arrested
  • స్నేహితుడు భవ్‌నిందర్ సింగ్ దత్తా అరెస్ట్
  • వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ గతంలో వార్తలు
  • ఇద్దరూ కలిసి ప్రొడక్షన్ కంపెనీ స్థాపన
  • దానిని అతడు అక్రమంగా సొంతం చేసుకున్నాడని నటి ఆరోపణ
  • పత్రాలు ఫోర్జరీ చేసినట్టు గుర్తించిన పోలీసులు
కోలీవుడ్ నటి అమలాపాల్ లైంగిక వేధింపుల ఫిర్యాదుతో తమిళనాడు పోలీసులు ఆమె స్నేహితుడిని అరెస్ట్ చేశారు. సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలను బయటపెడతానంటూ భవ్‌నిందర్ సింగ్ దత్‌ తనను వేధిస్తున్నాడంటూ అమలాపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న విల్లుపురం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు భవ్‌నిందర్‌ సింగ్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళ్తే.. భవ్‌నిందర్ సింగ్ కుటుంబం, అమలాపాల్ కలిసి 2018లో ఓ ఫిల్మ్ కంపెనీని స్థాపించారు. విల్లుపురం జిల్లా కోటకుప్పం సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే ఉంటూ సినిమా ప్రొడక్షన్ వర్క్ చేసేవారు. 

ఈ క్రమంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. వారిద్దరూ పెళ్లి చేసుకుంటారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే, ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో దూరం జరిగారు. తాము సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని భవ్‌నిందర్ తనను బెదిరిస్తున్నాడంటూ అమలాపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు, ఆర్థికంగానూ అతడు తనను మోసం చేశాడని ఈ నెల 26న ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. 

రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా, అమలాపాల్ నటించిన కడావర్ సినిమా ఈ నెల 12న ఓటీటీలో విడుదలైంది. దీనిని అమలాపాల్, భవ్‌నిందర్ కలిసి నిర్మించారు. ఈ సినిమా కోసం ఇద్దరం డబ్బులు పెట్టామని, కానీ ప్రొడక్షన్ కంపెనీ నుంచి తనను తొలగించి నకిలీ పత్రాలతో కంపెనీని ఆయన సొంతం చేసుకున్నారన్నది నటి ఆరోపణ. దీనిపైనా విచారణ జరిపిన పోలీసులు నిందితుడు కొన్ని పత్రాలను ఫోర్జరీ చేసినట్టు గుర్తించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
Amala Paul
Kollywood
Bhavninder Singh

More Telugu News