Pavan: పవన్ ఫ్యాన్స్ కి ఇది పండుగే: సాయితేజ్

Jalsa Movie Re Release

  • సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే 
  • 'జల్సా' .. 'తమ్ముడు' రీ రిలీజ్ 
  • అభిమానుల్లో ఉత్సాహం 
  • ఆనందాన్ని వ్యక్తం చేసిన సాయితేజ్

పవన్ కల్యాణ్ పుట్టినరోజు దగ్గరికి వచ్చేసింది. సెప్టెంబర్ 2వ తేదీ కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఆయన బర్త్ డే సందర్భాన్ని పురస్కరించుకుని, అభిమానుల కోసం 'జల్సా' .. 'తమ్ముడు' సినిమాల స్పెషల్ షోస్ వేస్తున్నారు.

'జల్సా' సినిమాను సెప్టెంబర్ 1వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా రీ రిలీజ్ ట్రైలర్ ను సాయితేజ్ సోషల్ మీడియాలో విడుదల చేశాడు. పవన్ మావయ్య నుంచి గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్లు రీ రిలీజ్ అవుతున్నందుకు తనకి చాలా ఆనందంగా .. ఉత్సాహంగా ఉందని చెప్పాడు. ఫ్యాన్స్ కి ఇది పండుగరోజేనని అన్నాడు. 

పవన్ నటించిన 'జల్సా' సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. 2008లో వచ్చిన ఈ సినిమా, బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇక 'తమ్ముడు' సినిమా విషయానికి వస్తే, 1999లో వచ్చిన ఈ సినిమాకి అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించాడు. ఈ రెండు సినిమాలు పవన్ కెరియర్లో ఎప్పటికీ ముందువరుసలో కనిపించేవే.

Pavan
Trivikram Srinivas
Saitej
jalsa Movie
  • Loading...

More Telugu News