Vijay Devarakonda: దుబాయ్ లో దాయాదుల క్రికెట్ మ్యాచ్... స్టేడియంలో సందడి చేసిన విజయ్ దేవరకొండ

- ఆసియా కప్ లో తలపడుతున్న భారత్, పాకిస్థాన్
- మ్యాచ్ చూసేందుకు వచ్చిన విజయ్ దేవరకొండ
- ఇర్ఫాన్ పఠాన్ తో కలిసి మ్యాచ్ ను వీక్షిస్తున్న వైనం
- కుర్తా, పైజమా డ్రెస్ లో లైగర్ హీరో
ఆసియా కప్ లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కు టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా విచ్చేశారు. మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తో కలిసి విజయ్ దేవరకొండ మ్యాచ్ ను వీక్షిస్తుండడం కెమెరాలకు చిక్కింది. మ్యాచ్ ఆరంభానికి ముందు టెలివిజన్ స్క్రీన్ పై సందడి చేశారు. స్టూడియోలో ఉన్న వ్యాఖ్యాతలతో ముచ్చటించారు.
