Mohanarao: టాలీవుడ్ దర్శకుడు బాబీకి పితృవియోగం

Tollywood director Bobby father dies of illness

  • బాబీ తండ్రి మోహనరావు కన్నుమూత
  • కాలేయ సమస్యతో బాధపడుతున్న వైనం
  • హైదరాబాదులో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స
  • పరిస్థితి విషమించడంతో ఈ మధ్యాహ్నం మృతి

టాలీవుడ్ దర్శకుడు బాబీకి పితృవియోగం కలిగింది. బాబీ తండ్రి మోహనరావు ఈ మధ్యాహ్నం కన్నుమూశారు. మోహనరావు వయసు 69 సంవత్సరాలు. ఆయన కొంతకాలంగా లివర్ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్నిరోజులుగా హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణిస్తూ వస్తోంది. పరిస్థితి విషమించడంతో నేటి మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. మోహనరావు అంత్యక్రియలు రేపు (సోమవారం) గుంటూరులోని నగరంపాలెంలో నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా, మోహనరావు మృతితో దర్శకుడు బాబీ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Mohanarao
Demise
Bobby
Director
Tollywood
  • Loading...

More Telugu News