Andhra Pradesh: నేడు జగన్, భారతిల 26వ వివాహ వార్షికోత్సవం... గ్రీటింగ్స్ చెప్పిన గవర్నర్
![ap governor conveys greetings to cm ys jagan on his marriage day](https://imgd.ap7am.com/thumbnail/cr-20220828tn630af477d70fa.jpg)
- 1996లో భారతి రెడ్డితో జగన్ వివాహం
- నేటికి జగన్ పెళ్లి జరిగి 26 ఏళ్లు
- వైసీపీ శ్రేణుల నుంచి అభినందనల వెల్లువ
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నేడు (ఆగస్టు 28) మరిచిపోలేని రోజే. 1996లో సరిగ్గా ఇదే రోజు ఆయన వైఎస్ భారతి రెడ్డిని వివాహం చేసుకున్నారు. వెరసి నేడు జగన్, భారతిల 26వ వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జగన్ దంపతులకు వైసీపీ శ్రేణుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
జగన్ మ్యారేజ్ డేను గుర్తు చేసుకున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదివారం ఉదయం ఆ దంపతులకు గ్రీటింగ్స్ చెప్పారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా జగన్ దంపతులకు మ్యారేజ్ డే విషెస్ చెప్పారు. జగన్ దంపతులకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని జగన్నాథ్, బాలాజీ దేవుళ్లను ప్రార్థిస్తున్నట్లు గవర్నర్ తన విషెస్‌లో తెలిపారు.