Panja Vaisshnav Tej: అందుకే ఈ సినిమా ఒప్పుకున్నాను: వైష్ణవ్ తేజ్

Vaishnav Tej Interview

  • గిరీశాయ ఫస్టు తెలుగు మూవీగా 'రంగ రంగ వైభవంగా'
  •  వైష్ణవ్ తేజ్ జోడీగా రాధ పాత్రలో కేతిక శర్మ
  • ఇలాంటి సినిమా ఈ మధ్యలో రాలేదన్న వైష్ణవ్
  • వచ్చేనెల 2వ తేదీన భారీస్థాయి విడుదల

వైష్ణవ్ తేజ్ - కేతిక శర్మ జంటగా నటించిన 'రంగ రంగ వైభవంగా' సినిమా, వచ్చేనెల 2వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో వైష్ణవ్ మాట్లాడుతూ  .. "గిరీశాయ ఈ కథను చెప్పగానే నాకు నచ్చింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఒక ఎంటర్టయినర్ రాలేదనిపించింది" అన్నాడు. 

ఈ సినిమాలో నా పాత్ర పేరు రుషి .. హీరోయిన్ పాత్ర పేరు రాధ. ఈ రెండు పాత్రల మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది. ఇద్దరి మధ్య ఉండే గిల్లికజ్జాలు ఆడియన్స్ కి బాగా నచ్చుతాయి. సెట్లో నేను సైలెంట్ గా ఉంటానుగానీ, కేతిక మాత్రం రాధ మాదిరిగానే అల్లరి ఎక్కువగా చేస్తుంది. అందువలన ఆమెకి తగిన పాత్రనే దొరికింది" అన్నాడు. 

దర్శకుడు గిరీశాయ మాట్లాడుతూ .. "చిరంజీవి అభిమానినైన నాకు తెలుగులో మొదటి సినిమానే ఆ ఫ్యామిలీ హీరోతో చేసే ఛాన్స్ రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో హీరో పాత్రలో వైష్ణవ్ నే ఊహించుకున్నాను .. అందువల్లనే ఆయనను ఒప్పించాను. పైకి అలా అమాయకంగా కనిపిస్తాడు గానీ, ఆయన కూడా అల్లరి బాగానే చేస్తాడు" అని చెప్పుకొచ్చాడు.

Panja Vaisshnav Tej
Kethika Sharma
Ranga Ranga Vaibhavanga
  • Loading...

More Telugu News