Pawan Kalyan: విశాఖలో పవన్ గణేశుడు... ఆసక్తికరంగా వినాయక ప్రతిమను చేయించిన జనసైనికులు

Janasena workers to install Vinayaka idol resemblance to Pawan Kalyan farmers initiative

  • ఏపీలో కౌలు రైతుల ఆత్మహత్యలు
  • కౌలు రైతుల కుటుంబాలకు పవన్ ఆర్థికసాయం
  • కౌలు రైతు భరోసా కార్యక్రమం అమలు చేస్తున్న జనసేన
  • పవన్ సాయం అందిస్తున్న దృశ్యాన్ని ప్రతిబింబించేలా గణేశ్ ప్రతిమ

జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టి, అనేకమంది రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, త్వరలో వినాయక చవితి రానుండగా, విశాఖలో జనసైనికులు ఆసక్తికలిగించే రీతిలో వినాయక ప్రతిమను చేయించారు. 

పవన్ కల్యాణ్ కౌలు రైతులకు ఆర్థికసాయం అందిస్తున్న ఘట్టాన్ని ప్రతిబింబించేలా వినాయక ప్రతిమను చేయించారు. పవన్ ను వినాయకుడిగా మలిచారు. ఆ పవన వినాయకుడే రైతు కుటుంబ సభ్యులకు సాయం అందిస్తున్నట్టుగా ఉన్న విశాఖ జనసైనికుల గణేశ్ ప్రతిమ అందరినీ ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

More Telugu News