Glowing Forest: మనకు దగ్గర్లోనే చీకట్లో మెరిసే అడవి.. చెట్లు, పొదలు కాంతి వెదజల్లుతుంటాయి!

Close to us is a forest that glows in the dark Trees and bushes are emitting light

  • మహారాష్ట్రలోని పూణె సమీపంలో భీమశంకర్ అభయారణ్యం ప్రత్యేకత
  • ఓ ప్రత్యేకమైన ఫంగస్ కారణంగా రాత్రుళ్లు ఆకుపచ్చని కాంతులు
  • వానాకాలం, తేమ ఎక్కువగా ఉండే సమయాల్లో కనువిందు చేసే వింత

ఏదైనా అడవిలో రాత్రయితే ఎలా ఉంటుంది. పూర్తిగా చీకటి అయి.. అసలేమీ కనిపించదు. అదీ కొండలు, గుట్టలతో కూడిన దట్టమైన అడవి అయితే ఇక అంతే. చిమ్మ చీకట్లే. కానీ మనకు సమీపంలోనే.. రాత్రిపూట వెలుగులు విరజిమ్మే ఓ అడవి ఉంది. అందులో చెట్లు, పొదలు ఆకుపచ్చ రంగులో కాంతిని వెదజల్లుతూ ఉంటాయి. మన దేశంలోనే మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో ఉన్న భీమ శంకర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం లేదా భీమశంకర్ అభయారణ్యం.

దట్టమైన అడవుల లోపల..
  మన దేశ పశ్చిమ తీరం వెంట అటు గుజరాత్ నుంచి ఇటు కేరళ వరకు కొండలు, గుట్టల వరుసతో కూడిన పశ్చిమ కనుమలు ఉన్నాయి. అందులో చాలా భాగం దట్టమైన అడవి ఉంటుంది. ఈ అడవిలో పూణెకు 100 కిలోమీటర్ల దూరంలో భీమశంకర్‌ అభయారణ్యం ఉంది. ఈ అడవిలో కొన్ని ప్రాంతాలు రాత్రిపూట కాంతిని వెదజల్లుతుంటాయి. చెట్లు, మొక్కలు, పొదలు, విరిగిపడ్డ కొమ్మలు ఆకుపచ్చ రంగు కాంతిని వెదజల్లుతూ, మెరుస్తూ ఉంటాయి.

ఎందుకిలా కాంతి వస్తుంది?  
  • కొన్ని రసాయన ప్రక్రియల ద్వారా కాంతిని వెదజల్లగలిగే (బయో ల్యూమినిసెంట్‌) ఫంగస్‌ ఈ అడవుల్లో వ్యాపించి ఉండటమే ఈ ఆకుపచ్చ రంగు వెలుగులకు కారణమని పరిశోధకులు గతంలోనే గుర్తించారు.
  • చెట్ల కాండాలపై ఉండే ఫంగస్‌ విడుదల చేసే లూసిఫరేస్‌ అనే ఎంజైమ్‌.. తేమతో కలిసినప్పుడు రసాయనిక చర్యలు జరిగి కాంతి విడుదలవుతుంది.
  • అందుకే వానాకాలంలోను, తేమ ఎక్కువగా ఉన్న సమయాల్లోను అడవిలో కాంతులు కనిపిస్తుంటాయి. సాధారణ సమయాల్లో కనిపించవు.
  • అభయారణ్యంలో కనిపించే ఆకుపచ్చని వెలుగును ‘ఫెయిరీ ఫైర్‌’,‘ఫాక్స్‌ ఫైర్‌’ వంటి పేర్లతోనూ పిలుస్తుంటారు.  
  • ఇలా కాంతిని వెదజల్లే ఫంగస్‌ లు అరుదని.. లక్ష రకాలపైగా ఫంగస్‌ లు ఉండగా, అందులో కేవలం 70 మాత్రమే ఇలా కాంతిని వెదజల్లగలవని నిపుణులు చెబుతున్నారు.
  • భీమశంకర్‌ అడవితోపాటు పశ్చిమ కనుమల్లోని మరికొన్ని ప్రాంతాల్లో వెలుగులు విరజిమ్మే ‘మైసెనా క్లోరోఫోస్‌’ రకం పుట్టగొడుగులు పెరుగుతాయి. అవి రాత్రిపూట లేత ఆకుపచ్చ రంగుకాంతిని వెదజల్లుతాయి.
  • సముద్రాల్లో కొన్ని రకాల ఆల్గే, జెల్లీ ఫిష్‌లు, చేపలు ఇతర సముద్ర జీవులు కూడా కాంతిని వెదజల్లగలవు.

  • Loading...

More Telugu News