Atchannaidu: జగన్ కు పిచ్చి ముదిరింది: అచ్చెన్నాయుడు

Atchannaidu fires on Jagan

  • చంద్రబాబు పర్యటనకు సరైన భద్రతను కల్పించడం లేదని మండిపడిన అచ్చెన్న 
  • మేము ఇలాగే చేసుంటే జగన్ పాదయాత్ర చేసేవారా? అని ప్రశ్న
  • అన్నా క్యాంటీన్ ను కూడా ధ్వంసం చేస్తున్నారని ఆవేదన

టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనకు వైసీపీ శ్రేణులు అడ్డంకులు సృష్టించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ పై అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జగన్ ఒక దుర్మార్గుడని, ఒక ఫ్యాక్షనిస్ట్ అని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ లేకుండా చేయాలని అనుకుంటున్నారని... అయితే అది జరిగే పని కాదని చెప్పారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ 175కి 175 స్థానాలను గెలవబోతోందని... అందుకే జగన్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తుంటే పోలీసులు సరైన భద్రతను కల్పించడం లేదని... తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే చేసుంటే జగన్ పాదయాత్ర చేసేవారా? అని ప్రశ్నించారు. 

జగన్ కు పిచ్చి ముదిరిందని అన్నారు. చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్లు విసిరే వారికి ఒక రేటు, దాడి చేస్తే మరో రేటు ఇచ్చి ఉసిగొల్పుతున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. జడ్ ప్లస్ కేటగిరీలో ఉండే చంద్రబాబును ఈ విధంగా చేయడం ఏమిటని ప్రశ్నించారు. కుప్పంలో అల్లరి మూకలను అదుపు చేయలేకపోతే.... ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. అన్నా క్యాంటీన్ ను కూడా ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

Atchannaidu
Chandrababu
Telugudesam
Jagan
YSRCP
  • Loading...

More Telugu News