Andhra Pradesh: ఈ నెల 29న జరగాల్సిన ఏపీ కేబినెట్ భేటీ వాయిదా
![ap cabinet meeting on 29th is postponed to september 1st](https://imgd.ap7am.com/thumbnail/cr-20220824tn6306513316f1d.jpg)
- సెప్టెంబర్ 1కి వాయిదా వేసిన రాష్ట్ర ప్రభుత్వం
- వాయిదాకు కారణాలు వెల్లడికాని వైనం
- ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీ కేబినెట్ భేటీ వాయిదాపడింది. ఈ నెల 29న జరగాల్సిన కేబినెట్ భేటీని ప్రభుత్వం తాజాగా వాయిదా వేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ నెల 29న జరగాల్సిన కేబినెట్ భేటీని వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం... సదరు భేటీని సెప్టెంబర్ 1న నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే, కేబినెట్ భేటీని వాయిదా వేయడానికి గల కారణాలను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తన ప్రకటనలో వెల్లడించలేదు.